Friday, May 25, 2007

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే



చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతొ తలరాతల్నే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రిల్లా ఎపుడూ ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లాఉద్దీన్ జిని ఉంటే
చూపదా మరి ఆ మాయాదీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్ వే

నడిరాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మోనాలీసా మొహం మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా
ఇలా రావా

వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనె అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగేనా ప్రతీరోజు ఎలాగైనా ఏదోరోజు
మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతొ తలరాతల్నే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

***

చిత్రం - ఐతే
సంగీతం - కళ్యాణి మాలిక్
సాహిత్యం - సిరివెన్నెల
గానం - M M కీరవాణి

6 comments:

kiraN said...

మంచి పాట... నాకు కూడా చాలా ఇష్టం :)

Anonymous said...

written by siriveenela

Unknown said...

Good one!

Chinna correction!

gurram gangaraju kaadu. Gunnam gangaraju.

:)

Unknown said...

Nice song. Loved it. And here is a small contribution from my side:

Lyrics: Sirivennela Seetarama Sastry
Music Director: Kalyani Malik (brother of MM Keeravani)
Playback Singer: MM Keeravani

Keep good work going ...

Cheers,
Gangadhar

Unknown said...

Also the video for this song is available from youtube:

URL: http://www.youtube.com/watch?v=3MZOjYOcOmI

Also you can use the Embed link, by visiting the above URL, to embed the video into this blog.

- Gangadhar

చైతన్య said...

@kiran
నాకు కూడా చాలా ఇష్టం, ఈమధ్య కాలం లో వచ్చిన అతితక్కువ మంచి పాటల్లో ఇది ఒకటి :)

@anonymous, venu, Gangadhar
thanks for the corrections