Tuesday, August 01, 2006

రానేల వసంతాలే

Listen to Dance Master - telugu Audio Songs at MusicMazaa.com

రానేల వసంతాలే
శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి

రానేల

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా
ఎద మీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల


***

చిత్రం : డాన్స్ మాస్టర్
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : -
గానం : చిత్ర

5 comments:

kiraN said...

ee pAta intaku mundu nenu vinledu.
vinpinchinanduku ధన్యవాదాలు :)

Anonymous said...

ఛైతన్య గరికి,
నమస్కారం
మీ రుచి అభిరుచి అభినందనీయం.
అభిప్రాయ భేదానికి క్షమాపణలు.
ఈ పాట వినడానికి ఉన్నంత ఇంపుగా విశదీకరించి వివరణ చెప్పు కుంటె లేదు అనిపిస్తుంది.
Eventhough each line feels like it makes sense, there is neither a flow nor continuity nor an overall theme. It is probably a direct result of having been written for a tune borrowed from Tamil, అని అనిపిస్తుంది.
Best wishes

రానారె said...

గొప్ప అభిరుచి మీది. ఆ నమ్మకంతో రాగ డాట్ కాం నుండి ఈ పాట ఇప్పుడే విన్నాను. పల్లవి వినగానే చిత్రగారే పాడిన "విరిసినదీ వసంత గానం వలపుల ..." భైరవద్వీపంలోది గుర్తొచ్చింది. రెంటికీ మూలం ఒకే రాగం కావొచ్చు. ఐతే కర్ష గారన్నట్లు గానం మధురం, సాహిత్యం 1987 లో విడుదలైన తమిళ "ఫున్నగై మన్నన్" తెలుగు అనువాదం కోసం రాయబడింది కాబట్టి అంతబాగా అతకలేదనే చెప్పాలి.

చైతన్య said...

kiraN... :)

karsha gaaru...
It is probably a direct result of having been written for a tune borrowed from Tamil, అని అనిపిస్తుంది.

avunanDi adhi oka dubbing movie lO ni song ki raasina saahityam... nAku ee pATA tune chaalaa baagaa nachindi... andukE post chEsAnu... may be meeru annaTTu sAhityam lO antagaa feel lEkapOyi unDochu... kAni nAku maatram bAgA nachindi :)

ramanadha reddy gaaru...
yeah... aa renDu paaTalaki moolam okE raagam ayi unDochu...
okE raagam to enno vibhinnamaina feel unna paaTalu unTaayi...
udAharaNa ki hindi lO unna "tere mere beech mein" , "dhak dhak karne laga" songs ki moolam okatE - sivaranjani raagam :)

ఐతే కర్ష గారన్నట్లు గానం మధురం, సాహిత్యం 1987 లో విడుదలైన తమిళ "ఫున్నగై మన్నన్" తెలుగు అనువాదం కోసం రాయబడింది కాబట్టి అంతబాగా అతకలేదనే చెప్పాలి.

yeah... i agree

చైతన్య said...

Damodaram gaaru...
thank u :)