ఈ సంబంధాన్నిలాగే
కొనసాగించాలనుకుంటున్నాను
అగ్ని సాక్షిగా తప్ప
ఆకాశం సాక్షిగా
భూమి సాక్షిగా
సప్త సముద్రాల సాక్షిగా
ౠతువుల సాక్షిగా
పంచమి సాక్షిగా
అమావాస్య సాక్షిగా
ఆ చెట్టు కింద
మేం కలిసి పడుకున్నాం
ఈ సరితారణ్యమంతా
కలిసి తిరిగాం
దూరాన్ని రద్దు చేసుకుంటూ
వెళ్ళినాక
మిగిలిన ఆఖరి సామీప్యం లో
అతను... నేను
కాసేపు మౌనం
పరామర్శిస్తుంది
చూపులు ఒళ్ళంతా
కరచాలనం చేస్తాయి
అతని ముందు నేనెప్పుడు
అలెర్ట్ గానే ఉంటాను
ముందుజాగ్రత్త చర్యగా
మాటల్లో సీరియస్నెస్
తెచ్చిపెట్టుకుంటాను
ముఖం భావరహిత
మైదానమవుతుంది
కళ్ళు కనిపిస్తే కాల్చివేతకు
సిధ్ధంగా ఉంటాయి
అయినా ఎక్కడో
పొరపాటు జరుగుతుంది
సమ్మోహనంగా ఒక చిరునవ్వు
నన్ను దాటుకు వెళ్తుంది
PS - నేను మహెజాబేన్ కవితని మార్చాను అనటం కంటే, తన కవితలోని కొన్ని వాక్యాలను ఉపయోగించుకున్నాను అంటే సరిగా ఉండేదేమో!!
2 comments:
kavitha chala baagundi. nenu aeppudu ame rachanalu chadavaledu. anyways, thanks for sharing
I like her poetry.
YJJ
Post a Comment